KDP: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం కడప నగరంలోని 12వ డివిజన్ చిన్న చౌక్ నందు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనలో అందిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు.