SKLM: వ్యవసాయ అనుబంధ శాఖల్లో అమలు జరుగుతున్న పథకాలు, ఇతర సేవలపై రైతులకు అవగాహన కలిగించేందుకు మంగళవారం నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సోంపేట మండల వ్యవసాయాధికారి నర్సింహమూర్తి తెలిపారు. ప్రతి మంగళ, బుధ వారాల్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన, నీటిపారుదల శాఖల అధికారులతో పర్యటిస్తామన్నారు.