తూ.గో: వరి సాగులో ఎక్కువ దిగుబడులు సాధించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘‘పొలం పిలుస్తోంది’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వారంలో ప్రతి మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గ్రామాల్లో కార్యక్రమం నిర్వహించేలా ఆదేశించారు. రాజానగరం వ్యవసాయాధికారి షేక్ ఇమామి ఖాసిం మాట్లాడుతూ.. పొలం పిలుస్తోంది కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.