VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి ఆలయానికి దేవస్థానం ఉద్యోగి తిరుమల రెడ్డి వెంకట నరసింహారావు కార్తీక ఆకాశ దీపాన్ని గురువారం బహూకరించారు. ఆలయం లో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన బహూకరించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతకు తీర్థప్రసాదాలు అందించారు.