ప్రకాశం: కొనకనమిట్ల మండల ఏపీఎంగా సుధాకర్ రావు శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి డ్వాక్రామహిళలకు వచ్చే పథకాలను చేరవేసేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం వెలుగు కార్యాలయం సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.