KRNL: కూటమి ప్రభుత్వంపై వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం కర్నూులలోని ఎస్వీ కాంప్లెక్స్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు సంబంధించిన మంత్రులంతా మద్యం సిండికేట్‌లో బిజీగా ఉన్నారని అన్నారు. ఉల్లి రైతులు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు.