కోనసీమ: గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీ కోసం కల్తీ నెయ్యి సేకరించిన అంశంలో భక్తుల మనోవేదనకు కారణమైన ప్రతీ ఒక్కరికీ తగిన శిక్ష తప్పదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం ఆలమూరు బస్టాండ్ సెంటర్లో బండారు సోదరులు, కూటమి నాయకులతో కలిసి శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఆవుపాలతో అభిషేకం చేశారు.