NTR: కుంకీ ఏనుగుల కోసం అడగగానే కర్ణాటక ప్రభుత్వం సకాలంలో స్పందించిందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో కర్ణాటక మంత్రి ఈశ్వర్‌తో దీనికి సంబంధించిన MOU కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రజల తరఫున పలు జిల్లాల్లో ఏనుగుల దాడులను అరికట్టాలని, కుంకీ ఏనుగులు కావాలని తాను గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగానన్నారు.