కృష్ణా: ముసునూరు మండలం లోపూడి గ్రామ శివారు బాసరప్పాడు గ్రామానికి చెందిన శివకృష్ణ (39) కడుపు నొప్పి తాళలేక బుధవారం పురుగు మందు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన శివకృష్ణను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, మార్గ మధ్యలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి ముసునూరు పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.