KRNL: ఆదోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బార్ పేట అంగన్వాడీ కేంద్రం నందు శనివారం పౌష్టికాహార మాసోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీవో ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని అన్నారు. ప్రత్యేకించి బాలింతలు, గర్బిణీలు సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.