VSP: విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈనెల 26 నుంచి 29 వరకు ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ మధ్య రంజీ మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్ సతీష్ బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగు రోజులపాటు జరిగే మ్యాచ్కు ఆంధ్ర నుంచి ఎస్.కె రషీద్, హిమాచల్ ప్రదేశ్ జట్టుకు రిషి ధావన్ కెప్టెన్లగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.