VKB: మెడికల్ షాపుల యజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా కాకుండా సేవా దృక్పథంతో పనిచేయాలని జిల్లా ఔషధ తనిఖీ అధికారి (డీఐ) క్రాంతికుమార్ కోరారు. ప్రజాపాలనలో భాగంగా శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచి వారి ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగస్వాములు కావాలని సూచించారు.