BPT: ఉరేసుకునే యువకుడు మృతి చెందిన సంఘటన నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. అడవులు దీవి పంచాయతీలోని మేకవారిపాలెం గ్రామానికి చెందిన ఏమినేని బాల వెంకట శివకుమార్(22) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడు శివకుమార్ రేపల్లెలో ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.