NTR-Prasanth : ఆర్ఆర్ఆర్ క్రేజ్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టేశాడు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే పూర్తి వివరాలు చెబతునానని.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు చరణ్. ప్రజెంట్ ఆర్సీ 15 చేస్తున్న చరణ్, ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేయబోతున్నాడు.
ఆర్ఆర్ఆర్ క్రేజ్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టేశాడు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే పూర్తి వివరాలు చెబతునానని.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు చరణ్. ప్రజెంట్ ఆర్సీ 15 చేస్తున్న చరణ్, ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేయబోతున్నాడు. ఈలోపు హాలీవుడ్ అనౌన్స్మెంట్ రావడం పక్కా అంటున్నారు. కానీ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి హాలీవుడ్ అప్డేట్స్ లేవు. మధ్యలో ఏవో కొన్ని వార్తలొచ్చినా.. తారక్ మాత్రం ఎక్కడా ప్రస్థావించలేదు. దాంతో యంగ్ టైగర్ సంగతేంటి.. అనే టాక్ నడుస్తోంది. అయితే ఎన్టీఆర్ నేరుగా హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయకపోయినా.. ప్రశాంత్ నీల్‌తో మాత్రం గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో బ్యాక్ టు బ్యాక్ కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. మార్చి 23న ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ కార్యక్రమం ఉంది. ప్రశాంత్ నీల్ ‘సలార్’ అయిపోయిన తర్వాత.. ఎన్టీఆర్ 31 స్టార్ట్ కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో.. భారీ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ టార్గెట్‌గా ఇంగ్లీష్‌లో కూడా ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని, హాలీవుడ్ యాక్టర్స్‌ని రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. తారక్‌తో చేస్తే.. కెరీర్ బెస్ట్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే.. ట్రిపుల్ ఆర్ మూవీతో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఎన్టీఆర్ 31ని నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అదే జరిగితే.. నందమూరి ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు.