ప్రముఖ దర్మకుడు రామ్ గోపాల్వర్మ(Ram Gopalvarma) మళ్లీ ఇప్పుడు తన స్పీడ్ పెంచడానికి సిద్దం అవుతున్నారు. వరుస ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనే రీసెంట్ గా నూతన ఆఫీస్ (New office) ను ఏర్పాటు చేసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన ఆసక్తిర కామెంట్స్ చేశారు.”నా లైఫ్ లో నేను చేసిన చెత్త సినిమా ఏదైనా ఉందంటే అది ‘అంతం’ సినిమా అని ఆయన అన్నారు. ఆ మూవీ లైన్ ను నేను ఒక బుక్ లో నుంచి తీసుకున్నాను.
సినిమా పూర్తయిన తరువాత చూస్తే, పుస్తకంలో లో ఉన్న మెటీరియల్ (Material) ను నేను సరిగ్గా గ్రహించలేకపోయాను అనిపించింది. బుక్ లో ఉన్న మెటీరియల్ తో పోల్చుకుంటే, ఆ లైన్ ను నేను చెడగొట్టాననే అనిపించింది” అన్నారు. “అయితే ‘అంతం’ సరిగ్గా ఆడకపోయినా, బాలీవుడ్ (Bollywood) లో నేను నిలదొక్కుకోవడానికి అదే కారణం. ఆ సినిమా వల్లనే నాకు ఊర్మిళ (Urmila) తెలిసింది. ఆ పరిచయంతోనే ‘రంగీలా’ చేశాను. ఇక ‘అంతం’ కథనే అటూ ఇటూ తిప్పి ‘సత్య’ సినిమా(Satya’ movie)ను తీశాను. ‘రంగీలా’ .. ‘సత్య’ ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నేను బాలీవుడ్ (Bollywood) లో స్టాండ్ అవ్వడానికి ఆ రెండు సినిమాలు కారణమే” అంటూ చెప్పుకొచ్చారు.