»Ashwin Ramaswamy The 1st Gen Z Indian American Running For Georgia Senate Seat
Indo American : అమెరికా, జార్జియా సెనేట్‌కి పోటీ చేస్తున్న 24 ఏళ్ల ఇండో అమెరికన్
భారత సంతతికి చెందిన అతి చిన్న వయస్కుడు అశ్విన్ రామస్వామి అమెరికాలోని జార్జియా సెనేట్‌కి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే కంప్యూటర్ సైన్స్, లా డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్ట సభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు.
Indo American In georgia senate elections : భారత సంతతికి చెందిన అతి చిన్న వయస్కుడు ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. ఆయన పేరు అశ్విన్ రామ స్వామి. వయసు కేవలం 24 సంవత్సరాలే. వీరి కుటుంబం 34 ఏళ్ల క్రితం భారత్‌లోని తమిళనాడు నుంచి అమెరికాకు వలస వెళ్లారు. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున అశ్విన్ పోటీ చేయనున్నారు.
చదవండి : టీలో రస్కుల్లాంటివి ముంచుకుంటున్నారా? మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్లే!
జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జెన్ Z (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) ఇండో అమెరికన్‌గా అశ్విన్ రామస్వామి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ పార్టీ.. షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అశ్విన్ గెలిస్తే జార్జియా స్టేట్ లెజిస్లేచర్‌లో మొదటి భారతీయ అమెరికన్ చట్ట సభ్యుడిగా ఘనత సాధించనున్నారు.
తన సొంత రాష్ట్రానికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో జార్జియా సెనేట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలాగే ఎదుగుతున్న ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని అన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఎన్నికల భద్రత, టెక్నాలజీ తదితర రంగాల్లో పనిచేశారు అశ్విన్. జార్జియా స్టేట్ లెజిస్లేచర్‌లో మొదటి భారతీయ అమెరికన్ చట్టసభ్యుడిగా కూడా ఘనత సాధించనున్నారు అశ్విన్ రామస్వామి. ‘నేను కాలేజీలో ఉన్నప్పుడు సంస్కృతం నేర్చుకున్నాను. అనేక పురాతన గ్రంథాలను చదివాను. ఉపనిషత్తులు చదివాలనే ఆసక్తి ఉంది. రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటాను’ అంటూ అశ్విన్ తన అభిరుచుల గురించి చెప్పుకొచ్చారు.