మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఈనెల 29, 30 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంపై తేమ అధికంగా ఉండటం వల్లనే అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురవనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కూడా కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. ఇక.. అల్పపీడనం వల్ల దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.