Coronavirus: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకి కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. కొవిడ్ పాజిటివ్ అని తేలితే తప్పనిసరి ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్క ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
జ్వరం, దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలు ఉన్న పిల్లల్ని పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే ఉంచాలని తల్లిదండ్రులను సూచించింది. వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. అలాగే 30,000 డోసుల కరోనా వ్యాక్సిన్ను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రభుత్వం కోరింది.