డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ సౌండ్.. ఎట్టకేలకు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. రేపే సలార్ ఫస్ట్ సింగిల్ రానుందని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
Salaar: ఇప్పటికే ఓవర్సీస్లో సలార్ (Salaar) అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర హాప్ మిలియన్ మార్క్ క్రాస్ చేసేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ప్రీ బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు యూకే, ఆస్ట్రేలియాలో కూడా సలార్ (Salaar) అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఓవరాల్‌గా ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది సలార్. ఇక ఇండియాలో డిసెంబర్ 15 నుంచి బుకింగ్స్ స్టార్ట్ కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈలోపు సలార్ నుంచి మరో ట్రైలర్ లేదా సాంగ్ బయటికొస్తే చూడాలని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని.. వాటిని థియేటర్లో మాత్రమే చూడాలి, వినాలి అనే టాక్ వినిపిస్తూ ఉంది.
రిలీజ్‌కు ముందు సలార్ నుంచి సాంగ్ బయటికొచ్చే ఛాన్స్ లేదనుకున్నారు. రిలీజ్‌కు పదిరోజుల ముందు నుంచి సలార్ సౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే సలార్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ రవిబస్రూర్ మాసివ్ ట్యూన్ రెడీ చేసుకున్నాడు. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చేశారు హోంబలే ఫిలింస్ వారు. ఈ రోజు సాంగ్ సలార్ ఫస్ట్ సింగల్ అప్డేట్ ఉంటుందని.. అందుకోసం హోంబలే మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్‌కి ట్యూన్ అయ్యి ఉండండని చెప్పిన మేకర్స్.. ఇప్పుడు రేపే సలార్ ఫస్ట్ సింగిల్ బయటికి రానుందని ప్రకటించారు. డిసెంబర్ 13న, అంటే రేపే సూరీడే అంటూ సాగే ఈ సాంగ్‌ను తెలుగు, హిందీ, కన్నడ, మళయాళ, తమిళ్లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.