»It Raids At Sampath Kumar Home His Wife Collapsed
IT Raids: సంపత్ ఇంటికి అధికారులు, స్పృహ కోల్పోయిన భార్య, ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ కాంగ్రెస్ నేత సంపత్ ఇంట్లో ఐటీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాత్రి, సంపత్ లేని సమయంలో ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న సంపత్ భార్య మహాలక్ష్మీకి బీపీ పెరిగిపోయింది. సృహ తప్పి పడిపోయింది.
IT Raids At Sampath Kumar Home, His Wife Collapsed
IT Raids: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడుతోన్న వేళ తెలంగాణలో ఐటీ రైడ్స్ (IT Raids) మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేత, అలంపూర్ అభ్యర్థి సంపత్ కుమార్ (sampath kumar) ఇంటికి అర్ధరాత్రి ఐటీ అధికారులు వచ్చారు. ఆ సమయంలో సంపత్ కుమార్ అక్కడ లేరు. అతని భార్య ఉన్నారు.
వడ్డపల్లి మండలం శాంతినగర్‌లో సంపత్ దంపతులు ఉంటున్నారు. రాత్రి సమయంలో ఇంటికి అధికారులు వచ్చారు. సమయానికి ఇంట్లో సంపత్ లేరు. దీంతో అతని భార్య మహాలక్ష్మీ భయపడింది. బీపీ పెరిగి.. స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఐటీ దాడుల విషయం తెలిసి సంపత్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఇంటికి బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రాత్రి పూట ఐటీ అధికారులతోపాటు విజిలెన్స్ ఆఫిషీయల్స్ వచ్చారు. దీంతో సంపత్ భార్య భయ పడింది. ఇదివరకు వివేక్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని ఆ మూడు పార్టీలు తహతహ లాడుతున్నాయి.