Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంటారు. ఈక్రమంలో ఆనంద్ మహీంద్ర చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐఐటీ బాంబేకు చెందిన కొందరు పూర్వవిద్యార్థులు ఫోల్డబుల్ ఈ-బైక్‌ను తయారు చేశారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐఐటీ బాంబే కుర్రాళ్లు దేశం గర్వపడేలా చేశారు. వీళ్లు ప్రపంచంలోనే పూర్తి-పరిమాణ చక్రాలతో ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఈ-బైక్‌ను తయారు చేశారు. ఇతర ఫోల్డబుల్ బైక్‌ల కంటే 35శాతం అదనపు సామర్థ్యంతో పాటు వేగం స్థిరంగా ఉండేలా అభివృద్ధి చేశారు. మడతపెట్టిన తర్వాత ఎత్తాల్సిన అవసరం లేని ఏకైక బైక్ ఇదే. ఆఫీస్ కాంపౌండ్ చుట్టూ తిరగడానికి బాగుంది. ఇప్పుడే దీనిపై తిరిగి వచ్చాను. దీని పేరు హార్న్‌బ్యాక్ ఎక్స్1(HORNBACK X1) అని ఆనంద్ మహీంద్ర తెలిపారు.
A bunch of IIT Bombay guys have made us proud again. They’ve created the first foldable diamond frame e-bike with full-size wheels in the world. That makes the bike not only 35% more efficient than other foldable bikes but it makes the bike stable at higher than medium speed. And… pic.twitter.com/U1HHGD6rfL
హార్న్ బ్యాక్ X1(HORNBACK X1)రూ. 44,999లతో ప్రారంభమవుతుంది. గ్రే-ఆరెంజ్, బ్లూ-ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఈ-బైక్ దొరుకుతుంది. ఈ-బైక్‌ను 15వేల మడతల వరకు పరీక్షించారు. దీనికి 36V, 7.65Ah బ్యాటరీ ఉంటుంది. సాధారణ 2 పిన్ ప్లగ్ పాయింట్‌తో బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఇది IP65 వాటర్, డస్ట్ రెసిస్టెంట్. బైక్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటలు పడుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 45కి.మీ వరకు ప్రయాణించవచ్చు. హార్న్‌బ్యాక్ వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ-బైక్ దొరుకుతుంది.