»Konda Surekha Road Accident In Bike Rally Bhupalpally
Konda surekha: రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేతకు రోడ్డు ప్రమాదం
తెలంగాణలో కీలక కాంగ్రెస్ నేత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్ ర్యాలీలో భాగంగా ఆమె పాల్గొన్న క్రమంలో స్కూటీ నుంచి కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
konda surekha road accident in bike rally bhupalpally
రాష్ట్రంలో మాజీ మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు కొండ సురేఖ(konda surekha)కు కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. బైక్ నుంచి ఆమె అదుపు తప్పి కిందపడిపోయారు. అయితే రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఆ క్రమంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ర్యాలీలో భాగంగా ఆమె స్వయంగా స్కూటీ నడిపారు. అయితే ప్రమాదంలో ఆమె కుడి కన్ను పైభాగం, చేతికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే సురేఖ గాయపడ్డ విషయం తెలుసుకున్న కొండా మురళి వెంటనే ఆస్పత్రికి చేరుకుని..ఆమెను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.