»Asian Games 2023 Nepal Vs Mongolia Many Records Made By Nepal Cricket Team Fastest T20 International Hundred Fifty And Highest Total
Asian Games 2023: టీ20లో యువరాజ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బద్దలు.. 9బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన దీపేంద్ర సింగ్
టీ20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా దీపేంద్ర సింగ్... భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. యువరాజ్ తన అర్ధ సెంచరీని 12 బంతుల్లో పూర్తి చేశాడు.
Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో నేపాల్, మంగోలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రికార్డుల పర్వం నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. కాగా, టీ20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా దీపేంద్ర సింగ్… భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. యువరాజ్ తన అర్ధ సెంచరీని 12 బంతుల్లో పూర్తి చేశాడు. అయితే దీపేంద్ర కేవలం 9 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని సాధించాడు. ఇవే కాకుండా నేపాల్ ఎన్నో రికార్డులు సృష్టించింది.
దీపేంద్ర నేపాల్ తొలి ఇన్నింగ్స్‌లో 520 స్ట్రైక్ రేట్‌తో 10 బంతుల్లో 52* పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా కుశాల్ మల్లా జట్టు కోసం 274 స్ట్రైక్ రేట్‌తో 50 బంతుల్లో 137* పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కుశాల్ ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కుశాల్ నిలిచాడు. కేవలం 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు, టీ20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ పేరిట ఉంది. అతను 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. నేపాల్ ఇన్నింగ్స్‌లో మొత్తం 26 సిక్సర్లు కొట్టింది.
టీ20 ఇంటర్నేషనల్‌లో 300కి పైగా పరుగులు చేసిన తొలి జట్టు
టీ20 ఇంటర్నేషనల్‌లో 300 పరుగుల మార్క్‌ను దాటిన తొలి జట్టుగా నేపాల్ నిలిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో నేపాల్ జట్టు చాలా బలంగా బ్యాటింగ్ చేసింది. దీని కారణంగా ఆ జట్టు 20 ఓవర్లలో బోర్డులో 3 వికెట్లకు 314 పరుగులు చేసింది. అంతకుముందు టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్ (278/3) పేరిట ఉంది. నేపాల్ తరఫున కుశాల్ మల్లా అజేయంగా ఉండగానే అత్యధికంగా 137* పరుగులు చేశాడు. ఇది కాకుండా కెప్టెన్ రోహిత్ పౌడే 225.93 స్ట్రైక్ రేట్‌తో 27 బంతుల్లో 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా దీపేంద్ర 10 బంతుల్లో 52* పరుగులు చేశాడు.