ఎన్డీఏ, ఇండియా కూటమిలో చెప్పుకోదగ్గ నేతలు లేరని.. థర్డ్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు.
Asaduddin Owaisi: మళ్లీ తెరపైకి థర్డ్ ప్రంట్ వచ్చింది. ఎన్డీఏ, ఇండియా కూటమి ఉండగా.. థర్డ్ ఫ్రంట్‌కు అవకాశం ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) అభిప్రాయపడ్డారు. దానికి బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరారు. అసద్ చేసిన కామెంట్స్ తెలంగాణే కాదు దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చకు దారితీసింది.
థర్డ్ ఫ్రంట్ అవసరం ఎందుకో అసద్ (Asad) వివరించారు. ఆ రెండు కూటముల్లో చెప్పుకోదగిన నేతలు లేరని తెలిపారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని.. కేసీఆర్ ముందుండి నడిపించాలని కోరారు. కేసీఆర్ అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ నడిపిస్తే దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తాయని వివరించారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ (kcr) ఏర్పాటు చేశారు. మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. 2018 సమయంలో ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ హడావిడి చేశారు. తర్వాత ఆ ఊసే మరచిపోయారు. బీఆర్ఎస్ విస్తరణలో నిమగ్నం అయ్యారు. బీఆర్ఎస్తో మైత్రీ ఉన్న ఎంఐఎం అధినేత ఇలా కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరికొద్దీ రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలను నేతలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పొడగించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. అలా అయితే ఫిబ్రవరిలో 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్ సభ ఎన్నికలు జరిగేందుకు ఆస్కారం ఉంది.