JR NTR: సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్..ఎన్టీఆర్ ఎమోషనల్!
జనతా గ్యారేజ్ సినిమాతో సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్(NTR)..ఇప్పుడు మరోసారి సైమా అవార్డ్(Siima 2023) సొంతం చేసుకున్నాడు. అందుకోసమే మొన్న దుబాయ్‌కి వెళ్లాడు. తాజాగా అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఫ్యాన్స్ మేలు కోరే వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌దే(NTR) ఫస్ట్ ప్లేస్. ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ లేకుంటే తాను లేనని గుర్తు చేస్తునే ఉంటాడు. తాజాగా మరోసారి అభిమానులకు పాదాభివందనం చేస్తున్నానని చెప్పి.. ఎమోషనల్ అయ్యారు. 2016లో జనతా గ్యారేజ్ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా సైమా అవార్డుని గెలుచుకున్న ఎన్టీఆర్.. మళ్లీ ఏడేళ్లకి ఇప్పుడు మరోసారి బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో కొమురం భీమ్ పాత్రకి ప్రాణం పోసినందుకు.. వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసినందుకుగాను ఎన్టీఆర్‌కి ఈ అవార్డ్ లభించింది. ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, అడవి శేష్, నిఖిల్ సిద్దార్థ్ కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ రేస్‌లో ఉన్నారు. కానీ వారిని వెనక్కి నెట్టి మరీ ఎన్టీఆర్ ఈ అవార్డుని గెలుచుకున్నాడు.
దీంతో ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్(trend) అవుతుంది. ఎన్టీఆర్ స్పీచ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక సైమా వేదిక పై యంగ్ టైగర్ మాట్లాడుతూ.. ‘మళ్ళీ మళ్ళీ నన్ను నమ్మిన నా జక్కన్నకు థాంక్స్.. ‘ఆర్ఆర్ఆర్’లో తనతో పాటు నటించిన కో స్టార్, మై బ్రదర్ రామ్ చరణ్‌కు కూడా థాంక్స్.. అని చెప్పారు. ఆ తర్వాత అభిమానుల(fans) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘నా అభిమానులు(fans) అందరికీ థాంక్యూ. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు.. నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా భాద పడినందుకు..నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు.. నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు..’ అని కాస్త ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.