Politicsలోకి అనసూయ.. అందుకే ఇవన్నీ: వేణు స్వామి సంచలనం
యాంకర్ అనసూయ రాజకీయాల్లోకి వస్తారని జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె ఇటీవల ఏడ్చిన వీడియో రిలీజ్ చేసి.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారని తెలిపారు.
Anasuya Entry To Politics: ఇటీవల యాంకర్ అనసూయ (Anasuya) ఏడుస్తోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె ఎందుకు ఏడ్చారో.. బాధకు గల కారణం ఏంటో తెలియలేదు. విజయ్ దేవరకొండతో గొడవ నేపథ్యంలో ఫీల్ అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ అదీ కారణం కాదని తర్వాత తెలిసింది. అనసూయ (Anasuya) ఏడుపునకు గల రీజన్‌ను ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి వివరించారు.
రెండు చేతులా సంపాదన
యాంకర్‌గా, నటిగా అనసూయ (Anasuya) బిజీ బిజీగా ఉన్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. సమయం చూసుకొని భర్త, పిల్లలతో కలిసి ట్రిప్పులకు వెళుతున్నారు. లైఫ్‌లో కావాల్సిన పేరు, డబ్బు సంపాదించింది. సో.. ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయాలని అనుకుందట. ఇదే విషయాన్ని వేణు స్వామి వివరించారు. అందుకే ఆమె ఏడ్చిందని.. అలా సానుభూతి పొంది పాలిటిక్స్‌లోకి వస్తోందని తెలిపారు. వేణు స్వామి ఇంతకుముందు చెప్పిన విషయాలు నిజం కాగా.. ఈ సారి అనసూయ విషయంలో కూడా అదే జరుగుతుందని కొందరు అంటున్నారు.
సామ్ చై, ఆది కపుల్..
సమంత- నాగచైతన్య విడిపోతారని వేణు స్వామి చెప్పారు. ఆయన చెప్పినట్టే ఆ జంట విడిపోయారు. తర్వాత ఆది పినిశెట్టి, నిక్కీ దంపతులు కూడా డివొర్స్ తీసుకుంటారని తెలిపారు. వారి విషయం ఇప్పటికీ బయటకు రాలేదు.. కానీ వారి మధ్య విభేదాలు ఉన్నాయని మాత్రం తెలిసింది. ఇప్పుడు అనసూయ ఏకంగా రాజకీయాల్లోకి వస్తోందని చెప్పేశారు. అయితే ఆమె ఏ పార్టీలోకి వెళ్తుంది.. తెలంగాణ నుంచి పోటీ చేస్తోందా..? లేదంటే ఏపీ నుంచి బరిలోకి దిగుతుందా అనే అంశాలపై మాత్రం తెలియజేయలేదు.
అనసూయ పాలిటిక్స్..?
సో.. అందాల అనసూయ (Anasuya).. ఇక రాజకీయ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. బుల్లితెర, వెండితెర మీద రాణించినట్టే.. పాలిటిక్స్‌లో కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలీ. వేణు స్వామి ఇదివరకు చెప్పిన విషయాలు నిజం కావడంతో.. ఇప్పుడు అనసూయ విషయంలో అదే జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.