Minister సంతకం ఫోర్జరీ.. వీళ్లూ మాములు కేటుగాళ్లు కాదుగా..?
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో ఫేక్ లెటర్‌ను సంగారెడ్డి కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్‌కు అనుమానం వచ్చి.. ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వారు తీసుకొచ్చింది ఫేక్ లెటర్ అని గ్రహించారు.
Minister Errabelli Dayakar Rao: కొందరు కేటుగాళ్లు ఎవరినీ వదలడం లేదు.. సాక్షాత్తు మంత్రుల సంతకం ఫోర్జరీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao) సంతకాన్ని ఫోర్జరీ చేశారు. లెటర్ హెడ్‌పై మంత్రి సంతకం చేసి.. ఏకంగా కలెక్టర్‌కు లేఖ అందజేశారు. అదీ ఫేక్ అని తెలియడం.. తర్వాత విషయం మంత్రి దృష్టికి వచ్చింది. దీంతో ఫేక్ లెటర్ తయారు చేసిన వారిపై కేసు పెట్టారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao) ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు. ఆయన పేరుతో ఓ ఫేట్ లెటర్‌ను సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడం గ్రామానికి చెందిన గౌస్ పాషా, గుంటి శేఖర్ కలిసి ఫేక్ లెటర్ తయారు చేశారు. డబుల్ బెడ్ రూ్ ఇళ్లను కేటాయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్‌కు సందేహాం కలిగి.. విచారిస్తే ఫేక్ అని తెలిసింది. అలా విషయం బయటకు పొక్కింది. మంత్రి ఎర్రబెల్లి (errabelli) ఓఎస్డీ డాక్టర్ రాజేశ్వర రావు (rajeshwara rao) దృష్టికి వచ్చింది. ఇంకేముంది ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంత్రి (minister) ఓఎస్డీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. గతంలో కూడా ఫేక్ లెటర్ హెడ్స్ తయారు చేశారు. విచారిస్తే.. అసలు విషయం తెలిసింది. తెలంగాణలో 3 నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అభివృద్ధి, సంక్షేమం కోసం అధికార పార్టీ కృషి చేస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు జరుగుతుందనే.. ఆతృత ఇలా మోసం చేశారు. కలెక్టర్ పసిగట్టడంతో వారి బండారం బయటపడింది.