In Maharashtra, buffaloes all together attacked a tiger and seriously injured it
TigerVsBufffaloes: అందరం చిన్నప్పుడు తెలుగు పుస్తకంలో ఐక్యమత్యమే మహాబలం(Unity is great strength) అనే పాఠం చదువుకున్నాము. అందులో అడవిలో ఉన్న ఆవులు అన్ని కలిసి పులిని అంతం చేస్తాయి. అది కథ అంటారా. అయితే అదే స్టోరీ తాజాగా రిపీట్ అయింది. సాధారణంగా పులి దాడిలో గేదె మృతి చెందిన వార్తలు చదువుతాం. డిస్కవరీ ఛానెల్లో చూస్తునే ఉంటాం. కానీ గేదెలు పులి మీద మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చిన అరుదైన ఘటన ఇది. అటవీశాఖ అధికారులు(Forest officials) తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర(Maharashtra)లోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకా పరిసరాల్లో కొంతకాలంగా పులి సంచరిస్తుంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. గురువారం ఉదయం మూల్ తాలూకాలోని ఎస్గావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై దాడికి యత్నించింది. అదే సమయంలో తెలివితో, ధైర్యంలో అతను చేతిలో ఉన్న గొడ్డలితో ఎదురు తిరగడంతో త్రుటిలో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అలాగే కొంత మంది పులి అలికిడిని చూసి భయపడ్డారు.
తర్వాత బెంబాడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెలపై పులి దాడి చేసింది. ఆ క్రమంలో ఆవులు భయంతో పరుగెత్తాయి. గేదెలు పరుగెత్తకుండా పులిపై ఎదురు దాడి చేశాయి. పులికి వాటికి మధ్య చాలా సమయం ఘర్షణ జరిగింది. ఈ దాడిలో గేదెలు అన్ని ఐక్యమత్యంగా ఉండీ పులని కొమ్ములతో పొడిచాయి. దీంతో పులి తీవ్రంగా గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చికిత్స కోసం దానిని చంద్రపూర్ కు తరలించారు. చికిత్స పొందుతూ పులి అదేరోజు రాత్రి చనిపోయిందని అధికారులు పేర్కొన్నారు. గేదెలు పులిని ఎదిరించిన దృశ్యాలను అక్కడే ఉన్న పశువుల కాపరులు తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.