KMM: విధులకు అనుమతి లేకుండా గైర్హాజరయ్యే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సిబ్బంది హాజరు శాతం మెరుగుపడాలని స్పష్టం చేశారు. జిల్లా అధికారులు నిరంతరం పర్యటనలు చేస్తూ పాఠశాలలు, వసతి గృహాల్లో భోజన నాణ్యతను పరిశీలించాలన్నారు.

