కృష్ణా: కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో స్పర్శ్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ బాలాజీ సోమవారం పిలుపునిచ్చారు. మచిలీపట్నం కలెక్టరేట్లో స్పర్శ్ అవగాహనా కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజల్లో కుష్టు వ్యాధిపై పూర్తి చైతన్యం తీసుకురావడం, శుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు.

