RR: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే యాదయ్య, నియోజకవర్గ ఇంఛార్జ్ భీం భరత్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

