HYD: గోల్కొండ సర్కిల్ నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(EE)గా నియమితులైన లాల్ సింగ్.. షేక్ పేట కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేటర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఈఈ ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈఈ లాల్ సింగ్కు కార్పొరేటర్ శుభాకాంక్షలు తెలిపారు.

