HNK: పరకాల మున్సిపాలిటీ 14వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాల రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఇవాళ మాజీ MLA చల్ల ధర్మారెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలతో విసుగెత్తిన నాయకులు BRS వైపు ఆకర్షితులవుతున్నారని మాజీ MLA పేర్కొన్నారు. కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.

