ASR: అరకులో జరిగిన ప్రజా దర్బార్లో హుకుంపేట మండలం, పట్టం పంచాయతీ వాసులు రోడ్ల కోసం వినతులు అందజేశారు. అరకు టీడీపీ ఇంఛార్జి, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ దొన్ను దొరకు తమ సమస్యలు వివరించారు. దాబవలస, గంగగుడి, పనసపుట్టు, బూరువలసలకు సీసీ రోడ్లు, అమనగిరి వరకు బీటీ రోడ్డు వేయాలని కోరారు. నిధులు మంజూరు చేయించి సమస్య పరిష్కరిస్తానని దొన్ను దొర హామీ ఇచ్చారు.

