కృష్ణా: వైసీపీ నేతల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పామర్రు వైసీపీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఎస్సై రాజేంద్రప్రసాద్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక, వైసీపీ నేతలపై దాడులు చేపిస్తున్నారని విమర్శించారు.

