T20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో USAపై భారత్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్-A 238 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో USA 200 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నారాయణ్ జగదీశన్ సెంచరీతో చెలరేగగా, బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, ఖలీల్ అహ్మద్ 2, నమన్ ధీర్ 2 వికెట్లు పడగొట్టారు. భారత్ తన తదుపరి వార్మప్ మ్యాచ్లో ఈ నెల 4న సౌతాఫ్రికాతో తలపడనుంది.

