NZB: ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి టీఎన్జీవోస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుమన్ కుమార్, శేఖర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో వీరమరణం పొందిన సౌమ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

