NLG: లక్ష్యసాధన కోసం విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు చిరబోయిన బాలాజీ సూచించారు. చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో సోమవారం నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. చదువుతోనే గౌరవం లభిస్తుందని, పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యమని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు విజయ శిఖరం పుస్తకాలు అందించారు.

