WGL: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ దేశ ప్రయోజనాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా ఉందని MCPI (యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆరోపించారు. ఇవాళ WGL చౌరస్తాలో MCPI (U) నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ.. వెంటనే బడ్జెట్ను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.

