SKLM: కొత్తూరు మండలం అల్లువీధిలో ఆదివారం సాయంత్రం ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణా, నిల్వలు చేయడం, అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలు యువత వినియోగించడం వంటి అంశాలును గురించి వివరించారు. వీటికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలను తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

