ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని వెదుళ్ల చెరువు, గుడిపాటిపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని మెరుగుపరచాలని డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి అధికారులను కోరారు. ఆదివారం ఆయన కనిగిరిలో ఆర్టీసీ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం రెండు గ్రామాలకు కలిపి ఒకే బస్సు తిప్పుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

