కృష్ణా: చల్లపల్లిలో శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి గ్రామోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. శ్రీచక్రస్థిత అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం జరిగింది. కళ్యాణమూర్తులకు నందివాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల శతానందశాస్త్రి, అరుణ్ శర్మలు పూజలు చేశారు. భక్తులు స్వామివారికి హారతులు, టెంకాయలు సమర్పించారు.

