U19 ప్రపంచకప్ సూపర్-6 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 253 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ 194 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆయూష్ మాత్రే బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ, బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే, ఖిలాన్ పటేల్ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ విజయంతో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది.

