ADB: గుడిహత్నూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆడే సునీల్ ఆదివారం బెల్గావ్ ఎమ్మెల్యే అభయ్ పాటిల్, ADB ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆడే సునీల్ గతంలో బోథ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2015లో ఏఎంసీ డైరెక్టర్ గాను సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

