అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ్టి మదనపల్లి పర్యటన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో అడుగడుగునా జననీరాజనాలతో ఘన స్వాగతం పలికారు. బాణాసంచా, డప్పు వాయిద్యాలతో పట్టణం సందడిగా మారింది. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

