AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితం ఆయనను నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను కోర్టుకు తరలించారు. కాగా, సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

