WGL: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి వివక్ష చూపించారని మంత్రి ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. నర్సంపేట MLA క్యాంప్ కార్యాలయంలో MLA దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అడిగిన ఒక్క అంశమైనా కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రమని.. అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

