AP: మాజీమంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల ఇళ్లకు నిప్పుపెట్టి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇదే పరిస్థితి రేపు వాళ్ల వరకు వచ్చేలా చేసుకుంటున్నారని హెచ్చరించారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు.

