NZB: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ప్రకటించారు. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విదాలుగా అండగా ఉంటుందన్నారు.

