టీమిండియా బ్యాటర్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లకు కూడా తిలక్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. తిలక్ జట్టులోకి తిరిగి రావడం టీమిండియాకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు గాయంతో అతడు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.

